తెలంగాణలో పోటీపై చంద్రబాబుకు నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

486
15 సీట్లతో చంద్రబాబు తెలంగాణ లో ఎంసాదిస్తాడు..
15 సీట్లతో చంద్రబాబు తెలంగాణ లో ఎంసాదిస్తాడు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడాన్ని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో ప్రశ్నించారు.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా , ఎక్కడ నుండి అయినా పోటీ చేయవచ్చని చెబుతూనే చంద్రబాబు మాస్టార్ ప్లాన్ నికి చెక్ పెట్టారు.. కేసీఆర్ కు హింట్ కూడా ఇచ్చాడు.. టీఆర్ఎస్ వెళ్లి ఏపీలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్.. కేసీఆర్ చెప్పినట్టు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, అప్పుడే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని సూచించారు..

ఇక తెలుగు రాష్ట్ర ప్రజలకు కావలిసింది కబడ్డీ మ్యాచ్ లు కాదని, తెలంగాణ ఎన్నికలు ముఖ్యమని, అందులో కూడా ఎవరు పార్టీలు మారుతున్నారు, ఎప్పుడు ఎవరితో కలుస్తున్నారు, ఏ నాయకుడు ఓటుకు ఎంతిస్తున్నాడనేవి ముఖ్యమని, వీటిని ప్రసారం చేస్తే కాస్త బాగుంటుందని మీడియాను ఉద్దేశించి మాట్లాడారు..

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు కేసీఆర్ తప్ప మరో ప్రయత్యామ్నాం కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలతో సంబంధం లేకుండా ప్రజలు జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాలని, ఎవరు సమర్థవంత మైన నాయకుడో వారికి ఓట్లు వేసి గెలిపించాల్సిన భాధ్యత ప్రజల పై ఉందన్నారు.. ఓటు వేసే టప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించి వేయాలని తెలంగాన ప్రజలకు ఆయన హెచ్చరించారు..

చంద్రబాబు నాయుడు ఓ గొప్పనాయకుడే అని కానీ తెలంగాణలో తను 15స్థానాల్లో పోటీ చేసి ఏంసాదిస్తారో అర్థం కావడంలేదని, అతను ఆ స్థానాలతో సీఎం కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కూడా సాదించ లేడని, అలాంటిది ఇక చక్రం తిప్పాలను కోవడం తన మూర్ఖత్వం అని ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే ఎటువైపు మొగ్గుచూపుతారని ప్రశ్నించాలన్నారు. ఇక, తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తన ఫేవరెట్ నాయకుడని ప్రకాశ్ రాజ్ తెలిపారు.. కాగా ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

తెలంగాణలో టీడీపీ పోటీ చేసే హక్కున్నప్పుడు, టీఆర్ఎస్ ఏపీ లో పోటీ చేవచ్చు కదా అని అన్నారు.. దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రకాశ్ రాజ్ కేసీఆర్ కు ఉచిత సలహా ఇచ్చాడని చెబుతున్నారు.. ఇదంతా పక్కన పెడితే దేశంలో జరుగుతున్న వాటిపై ఎప్పటి కప్పుడు స్పందించే ప్రకాశ్ మరో సారి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను తన మనోగతంలో ఆకట్టు కున్నాడని చెప్పవచ్చు.. రాజకీయ నాయకుల్లో కూడా మరో ఆలోచనని రేకిత్తించాడని వారు భావిస్తున్నారు..