మెగా బ్రదర్ నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నటి శ్రీ రెడ్డి

0

నందమూరి బాలకృష్ణ పై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను కండించారు నటి శ్రీ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మెగా కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నందమూరి బాలకృష్ణ ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే అది మీ అదృష్టమని ఆమె అన్నారు. చిత్ర పరిశ్రమలో మొదటి ఉన్న కుటుంబం నందమూరి వారే అని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఆయన తనయుడు గుర్తు తెచ్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మెగా కుటుంబంలో హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఓ ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ అని అరుస్తుంటే వారిపై మండిపడ్డ రోజు మీరు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ నేడు రాజకీయ పార్టీ పెట్టగానే అందరు ఒక్కటైయ్యారని విమర్శించారు. చిత్ర పరిశ్రమలో మీ హీరోలు చేస్తున్న దానికంటే బాలయ్య గారు చేసింది తక్కువే అని అన్నారు. మెగా కుటుంబం ఎంత మంది నటీనటులను ఆదుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు అడ్డుగా ఉన్న వారికి , మీ పై ఆరోపణలు చేసిన వారికి సినిమా అవకాశాలు రాకుండా చేసింది మీ కుంటుబంలో ఉన్న వారు కాదా.! వారిని ఎందుకు మీరు వేనుకేసుకోచ్చారని నాగబాబుని శ్రీ రెడ్డి ప్రశ్నించారు. మీ కుటంబం పై అభిమానం ఉన్న కొందరు సోషల్ మీడియాలో నానాయాగి చేస్తుంటే ఎందుకు అపలేక పోయారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.