పైలట్ చేసిన తప్పు వల్లే ప్రాణాలు పోయాయి..

74

పైలట్ చేసిన తప్పు వల్లే ప్రాణాలు పోయాయి..

నేపాల్ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాద ఘటనలో 49మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం వెనుక ఫైలట్ తప్పిందముందని ప్రాథమిక విచారణలో తేలిందని నేపాల్ విమానయాన శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో మరో 22మంది తీవ్ర గాయపడ్డారు.

వివరాల మేరకు.. రన్ వేపై రన్ వేపై దిగుతూ విమానం స్కిడ్ అవడంతో.. పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయి మండిపోయిందని నేపాల్ పోలీస్ ప్రతినిధి మనోజ్ నౌపేన్ వెల్లడించారు.  విమానాశ్రయంలో దక్షిణపు వైపు నుంచి ల్యాండ్ అయ్యేందుకు పైలట్ కు అనుతి ఇవ్వగా.. దాన్ని పట్టించుకోని పైలట్ ఉత్తరం వైపు నుంచి ల్యాండింగ్ కు ప్రయత్నించినట్లు.. నేపాల్ డీజీసీఏ అధికారి సంజీవ్ గౌతమ్ తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలనూ పైలట్ పట్టించుకోలేదన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ విమానంలో నేపాల్, బంగ్లాదేశ్ వాసులతో పాటు కొందరు చైనా, మాల్దీవుల పౌరులు కూడా ఉన్నారని తెలిపారు.  గడచిన 25 సంవత్సరాల్లో నేపాల్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు.