నందిగామలో వైభవంగా జరిగిన ‘నేనే ముఖ్యమంత్రి’ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ !!

0

శ్రీ వైష్ణవి ఫిలింస్‌, ఆలూరి క్రియేషన్స్‌ పతాకాల‌పై అట్లూరి నారాయణరావు , ఆలూరి సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. దేవిప్రసాద్‌, వాయు తనయ్‌, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ రావిపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల‌ 8న గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ బుధవారం నందిగామలోని చైతన్య కాలేజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలలో ఒకరయిన

అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ “మనల్ని పాలించే నాయకుల‌ను ఎటువంటి వారిని ఎన్నుకోవాలి? ఎటువంటి నాయకును ఎన్నుకోవద్దు ? అనే అంశాన్ని మా చిత్రం ద్వారా చూసిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో నిస్వార్థంతో సేవ చేసే నాయకులు మనకు అవసరం. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనదే అనేది మా సినిమాలో చూపించాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది” అన్నారు. అనంతరం చిత్ర బృందం సినిమా గురించి వివరించారు.