రాజన్న రాజ్యం త్వరలో రాబోతోంది. : టీజేఆర్

0

వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు విజవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పూర్తి అయిన సందర్బంగా అభినందనలు తెలిపారు. త్వరలో రాజన్న రాజ్యం రానుందని , జగన్ ప్రజల అభీష్టం మేరకు సీఎం అవుతారని అన్నారు.

ప్రజాసంకల్ప యాత్ర లో జగన్ ప్రత్యక్షంగా 2 నుండి 3 కొట్ల మంది ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కోనియాడారు. పేద ప్రజలకు కొండత అండగా ఉంటానన్న భరోసా ఇచ్చారని వెల్లడించారు. జగన్ కు పాదయాత్రలో నీరాజనాలు పట్టిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేశారు.. అనంతరం చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. టీడీపీ తన మిత్ర బృందం విడిపోవడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ను విమర్శిస్తున్నారని తెలిపారు. ప్రజలు “నిన్ను నమ్మం బాబు” అంటున్నారని ముఖ్యమంత్రి తెలుసుకోవాలని విమర్శించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావడానికి వైకాపా నేతలు, కార్యకర్తలు ఓ సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు