నాన్న‌తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నా – లోకేష్

36
ap naralokesh.
ap naralokesh.

వెంక‌న్న సాక్షిగా ప్ర‌ధాని మోదీ ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌లేద‌ని టీడీపీ మంత్రి నారాలోకేష్ అన్నారు. రాబోయే ఎన్నిక‌ల సార్వ‌త్రిక‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించిన లోకేష్ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌ని గెలిపిస్తే భూగ‌ర్బంలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం, మంచినీటి సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. తండ్రి చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వారి త‌ల్లిదండ్రుల కోసం నిర్విరామంగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అన్నారు. ఆయ‌న వ‌య‌స్సు 68 ఏళ్లు కానీ 24ఏళ్ల కుర్రాడిలా ప‌రిగెత్తుతున్నారు.మేం పోటీ ప‌డ‌లేక‌పోతున్నాం అంటూ చంద్ర‌బాబుపై నారాలోకేష్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.