టీడీపీ జపం చేసే మీడియా తప్పుడు లెక్కలు చూపుతుంది

0

వైకాపా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా చేస్తున్న ఆరోపణలను వైకాపా నేత కోడలి నాని ఖండించారు. విజయవాడ వైసీపీ పార్టీ కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోడలి నాని చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. చంద్రబాబు అవినీతి చరిత్ర గురించి ఎవరికీ తెలియదంటూ నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడని, సొంత మామకే అన్యాయం చేసిన నీచుడు అంటూ విమర్శించారు. చంద్రబాబు వంటి నీచుడు ప్రపంచంలోనే లేడని, ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఒక టీవీ కార్యక్రమంలోనే చెప్పారని నాని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన నవరత్నాలు పథకాని కాపీ కొట్టి, అందులోని హామీలను ప్రజలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. మొన్నటి వరకు మోదీ పంచన చేరి, నేడు కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన అవినీతి చక్రవర్తి పుస్తకం పైన స్పందించిన నాని, పుస్తకం పై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. ఇసుక మాఫియాను బడ్జెట్ లో పెట్టారా లేక అమరావతి భూముల అక్రమాలను మానిఫెస్టోలో పెట్టారా…. ఇవన్నీ దోచుకున్నవి కాదా అని నాని అని వ్యగ్యాస్త్రాలు సంధించారు