నిన్ను నమ్మం బాబు అంటూ మండిపడుతున్న వైసీపీ నేతలు

0

ప్రకాశం జిల్లా లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా నాయకులు, చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. తెలుగు రాష్ట్ర ప్రజలు “నిన్న నమ్మం బాబు” అంటున్నారని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడటంతో కేంద్రంలో బీజేపీని , రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీని విమర్శిస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు.

చంద్రబాబుకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ది ఉంటే అమరావతి ప్రజలను అడిగి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టే వారని, కేవలం టిడిపి నాయకుల స్వార్థం కోసమే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడటంతో అమరావతి లోని అభివృద్ధిని చూపడానికి నేడు ప్రజలను ఆహ్వానిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ రాజధానికి శంకు స్థాపన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని సందర్శనార్థం ఎందుకు పిలుపు ఇవ్వ లేదని వారు ప్రశ్నించారు. కేవలం ప్రజలను అభివృద్ధి పేరుతో మభ్య పెట్టేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నింస్తున్నారని ప్రజలు “నిన్ను నమ్మం బాబు ” అంటున్నారని వైకాపా నేతల తెలిపారు.