ధనబలంతో టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటుంది

0

సార్వత్రిక ఎన్నికల్లో ధన బలంతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ పార్టీ భావిస్తోందని రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు అన్నారు. మార్చి 22 న మీడియాతో మాట్లాడిన అయన ఏపీలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు.

ఇటువంటి అవినీతి మరకలున్న నాయకులు ప్రజాసేవ చేస్తారనుకోవడం భ్రమేనని విమర్శించారు. ఏపీలో ప్రధాన పక్షాలు రానున్న ఎన్నికల్లో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని జి.వి.ఎల్‌ అన్నారు. ఎన్నికల సంఘం నిఘాను పెంచి విచ్చలవిడిగా డబ్బు పంపిణీని అడ్డుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో వేల కోట్ల నల్లధనం బయటకు వస్తుందని నరసింహారావు అన్నారు.