మరో సారి అవకాశం ఇవ్వండి ఋణం తీర్చుకుంటా.

32
ap bjp leader karnati anjanailu.
ap bjp leader karnati anjanailu.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మార్చి 22న ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగాకర్నాటి ఆంజనేయులు రెడ్డి ఆర్డీఓ కార్యలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు సత్రం సెంటర్ నుంచి అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని హమీ ఇచ్చారు. ఈ పోటీలో కోటేశ్వరులు ఉన్నారని నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని తనకి మధ్య తరగతి కుటుంబాల సమస్యలు తెలుసని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం తానేమి కోత్త కాదని 1989లో ఆత్మకూరు నుండి పోటీ చేశానని ఆరోజు గెలిపించారని రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి రావడంతో తన గెలుపు ఓటమిగా మారిందని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఒక్క సారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు రావణ అప్ప నాయుడు, సుధాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు