చంద్రబాబు ఒక సామజిక ఉగ్రవాది.

0

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సామాజిక ఉగ్ర‌వాదిగా త‌యార‌య్యాడ‌ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్య‌క్షుడు పాకా స‌త్య నారాయ‌ణ అన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులోని స్థానిక అశోక్ న‌గ‌ర్‌లోని బీజేపీ జిల్లా కార్యాల‌యంలో శుక్ర‌వారంఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. చీటికీ మాటికీ కేంద్ర ప్ర‌భుత్వంతో గొడ‌వ‌లు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని చంద్ర‌బాబే అడ్డుకున్నార‌న్నారు.

ఎన్న‌డూ లేని విధంగా రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ, ఓసీల్లో చిచ్చు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఎస్సీ ల వ‌ర్గీక‌ర‌ణ పేరుతో మాల‌లు, మాదిగ‌ల మ‌ధ్య త‌గ‌వులు పెట్టార‌ని ఆయ‌న అన్నారు. కాపుల‌ను బీసీల్లో చేర్చే విష‌యంలో అసెంబ్లీ తీర్మానం చేసి ఊరుకున్నార‌ని,తాజాగా ప్ర‌ధాని అగ్ర‌వ‌ర్ణ పేత‌ల‌కు ప్ర‌క‌టించిన 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5 శాతం కాపుల‌కు కేటాయిస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయ‌నఅన్నారు.

అవినీతిలోకూరుకుపోయిన చంద్ర‌బాబు రాష్ట్రాభివృద్ధికి బీజేపీ,కేసీఆర్, జ‌గ‌న్‌లు అడ్డుపడుతున్నారంటూ విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గు చేట‌ని అన్నారు. వారు ముగ్గురూ క‌ల‌సి త‌న‌పై కుట్ర‌లు ప‌న్నుతున్నారంటూ ప్ర‌జ‌ల్ని ప‌క్క దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాన్ని చేస్తున్నార‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం ఆడ‌లేక మ‌ద్దెల ఓడు లా ఉంద‌ని స‌త్య‌నారాయ‌