ఏపీ సెట్ ల తేదీలను వెల్లడించి మంత్రి గంట శ్రీనివాస రావు

0

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాశాఖ మంత్రి గంట శ్రీనివాస రావు మాట్లాడుతూ 2019 – 2020 విద్యా సంవత్సరానికి సంబందిచి ఏపీ పీజీ సెట్ తేదీలను వెల్లడించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. అన్ని సెట్ లను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

గతంలో పరీక్షల నిర్వహణ ఆలస్యం కావడం వల్ల ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వెళ్లిపోయేవారని ప్రస్తుతం ఆపర్థిని చక్కదిద్దేందుకే ప్రభుత్వం సెట్ పరీక్షన్ ముందుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సెట్ పరీక్షను ఏడు దశల్లో నిర్వహింస్తున్నట్లు వెల్లడించారు. సెట్ పరీక్ష నిర్వాహణ బాధ్యతలను యునివర్సిటీలకు అప్పజెప్పినట్లు తెలిపారు. ఈ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తామని మంత్రి అన్నారు. గత రెండేళ్లుగా ఆన్ లైన్ లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.