గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ప్రభాకర్ చౌదరి.

83
andrapradesh, prabhakar choudari.
andrapradesh, prabhakar choudari.

అనంతపురం రూరల్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టీడీపీ అధిష్టానం మళ్లీ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే .. కాగా నేడు ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా స్థానిక ఆర్డీవో కార్యాలయంకు వచ్చి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో మరోసారి టికెట్ ఇచ్చారని, అందుకు ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు.

పార్టీ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయనని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఏ రోజు పార్టీ జెండా మోయనివారు నేడు నానా యాగీ చేస్తున్నారని పార్టీకి కష్టపడి పని చేస్తున్న వారిని కలుపుకొని నియోజకవర్గంలో ముందుకు పోతానని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తనని ఓడించేందుకు పార్టీలోని కొందరు చూస్తున్నారని వారందరికి ప్రజలే బుద్ది చెప్పాలని ఆయన కోరారు.