రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్రస్సు గల్లంతు చేయాలి- చింతమనేని

0

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ప్రచారం ముమ్మరం చేసారు. జిల్లాలోని దుగ్గిరాలలో ఆయన తన ప్రచారాన్ని నిర్వహించారు .ప్రచారంలో భాగంగా అన్నదానం కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు..అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన పధకాలే తిరిగి అధికారం కట్టబెడతాయని , ప్రతిపక్షం అడ్రస్సు రాష్ట్రంలో గల్లంతైయ్యేలా ప్రచారం నిర్వహించాలని అన్నారు. తెలుగు దేశం నాయకులు మాట్లాడుతూ చింతమనేని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.