తండ్రికి తగ్గ తనయుడు.

57
bojjala sudheer reddy.
bojjala sudheer reddy.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని అధిష్టానం ప్రటించడంతో కొందరు సీనియర్ నాయకులు ఈ అంశాన్ని ఖండిచిన్పటికి కూడా చంద్రబాబు నాయుడు బొజ్జలకు భీఫామ్ ఇవ్వడంతో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా తన తండ్రి బాటలో నడిస్తానని అందరికి అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.

తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రికి, నారా లోకేష్ ఆశలను వమ్ము చేయనని 30,000వేల మెజారీటితో గెలుపొందడం ఖాయం అన్న ధీమా వ్యక్తంచేశారు. అవినీతి సామ్రాజ్యానికి రారాజు ఐన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే జైల్లో కూర్చోని కారగార పరిపాలన చేస్తాడని ఎద్దేవ చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా కోట్లు దండుకున్న నువ్వు మా నాయకుడిని విమర్శించడం ఆకాశాన్ని చూసి ఉమ్మువేయడంతో సమానం అని జగన్ పై తీీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యక్రతలు , బొజ్జన అభిమానులు తదితరులు పాల్గొన్నారు.