ముగిసిన ఓటరు న‌మోదు ప్ర‌క్రియ

14
ap, telangana, elactions.
ap, telangana, elactions.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది.విజ‌య‌వాడ‌లో వీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు డివిజన్ల వారీగా అధికారులతోపాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి ఓటు దరఖాస్తులను అం దించారు. అంతేకాకుండా ఆన్‌లైన్ లో కూడా నమోదు సౌకర్యం ఉండటంతో వేలాది మంది తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం ఓటు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తరుణంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, వాటిలో అర్హత కలిగిన వా రందరికీ ఓటు హక్కును కల్పించేందు కు అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి వారి డివిజన్లు, బూత్‌ల వారీగా విభజించి సంబంధిత అధికారులకు అందించనున్నారు.

ఫారం-7 తో ఓట్లను తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రజానీకం తమ ఓటును సరిచూసుకుని లేనిపక్షంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవడంతో ఓటు కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కూడా ప్రస్తుత జాబితాలో ఓటు లేకుండాపోవడానికి గల కారణాలు ఏమిటన్న విషయం పక్కన పెడితే, అర్హత కలిగిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఎన్నికల అధికారు లు ఊపిరి సైతం పీల్చుకోలేని పరిస్థితి లో తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

 ఒకపక్క ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోపక్క అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రక్రి య అంతా రోజుల వ్యవధిలోనే ప్రా రంభం కావడంతో, ఆయా ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, విధులు అప్పగింత, సిబ్బంది ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఓటు నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయ గా, తదుపరి చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు