అభివృద్ధి అడ్డుకునే వారు మీ గ్రామంలో ఉన్నారు :- రావెల.

0

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న రావెల కిషోర్ బాబు వట్టి చేరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు గుర్తు చేశారు. అప్పట్లో ముట్లూరు గ్రామాన్నీ అభివృద్ధి చేయలేకపోటనికి కారణం మీ గ్రామ నాయకులే కారణం అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీపుకు వెలతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.