ఇది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం

0

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున అభిమానులు , వైకాపా శ్రేణులు పగిడ్యాల రోడ్ నుండి కే. జి రోడ్డు వరకు భారీ ర్యాలీగా తిరలి వచ్చారు. ఈ సందర్బంగా వైసీపీ నేత సిద్దారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మండ్ర శివానందరెడ్డి ని నందికొట్కూరు నయీమ్ గా అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో మంచికి, డబ్బుకు, ధర్మానికి ,ఆధర్మనికి పోటీ సాగుతోందని ఆయన అన్నారు.