బాబు “ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం”.

0

శ్రీ విద్యానికేతన్ విద్య సంస్థల అధినేత మోహన్ బాబు తిరుపతిలో భారీ ర్యాలీకి పిలుపినించిన విషయం తెలిసిందే. అయితే ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా మోహన్ బాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీనిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సిగ్గుపడాలని అన్నారు. “ప్రజాస్వామ్య విలువలు లేని నువ్వు “40 సం” సీనియర్ అని చెప్పుకోడానికి సిగ్గుపడాలి. సినీనటుడు మోహన్ బాబు గారు విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు తెలియచేస్తోంది. విద్యార్థుల కోసం పోరాడితే హౌస్ అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం?” అని ఆయన ప్రశ్నించారు. ర్యాలీకి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే మోహన్ బాబును పోలీసులు నిర్బంధించారు.

చంద్రబాబు నామినేషన్ దాఖలు చేస్తుండటంతో, అవాంఛనీయ ఘటనలు జాగరకుండా ముందు జాగ్రత్త చర్యగానే ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరును విద్యార్థులు తీవ్రంగా కందిస్తున్నారు. ప్రజాస్వామ్యదేశంలో విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాడుతున్న వ్యక్తిని నిర్బంధించడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.