టికెట్ ఇస్తే స‌రి..లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా

248
ap tdp bhuma bramhanandab reddy.
ap tdp bhuma bramhanandab reddy.

టీడీపీ అధిష్టానం 126 మంది సభ్యులతో కూడిన తొలి జాబితాను ఇటీవలే విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ అభ్యర్ధిగా మంత్రి భూమా అఖిల ప్రియను ఖరారు చేయగా, నంద్యాల మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఐతే రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని టికెట్‌ తనదేనని…భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాలలో కార్యకర్తలతో బ్రహ్మానందరెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నంద్యాల టికెట్‌ తనకే వస్తుందని, టికెట్‌ ఇవ్వకుంటే భూమా నాగిరెడ్డి, చంద్రబాబు ఫోటోలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే నంద్యాల టికెట్‌ తనకివ్వాలని ఏవి సుబ్బారెడ్డి, తన అల్లుడికే నంద్యాల టికెట్‌ ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఐతే రెండో జాబితాలో నంద్యాల టికెట్‌ ఎవరికి ఖాయమవుతుందో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.