లక్షమంది పోలీసులు వచ్చి కూర్చున్నా ముప్పై వేల మెజారిటీతో గెలుస్తా – ఆమంచి.

296
chirala ycp leader aamanchi krishna mohan.
chirala ycp leader aamanchi krishna mohan.

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో రాష్ట్రంలో శాంతి భద్రలు దిగజారిపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారి మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని అమంచి మండిపడ్డారు. టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు వైకాపా నేతలపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా హత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తమపై ఎన్నికేసులు పెట్టిన జైల్లో నుంచి అయినా ఎన్నికలు పోటీ చేస్తామని, నియోజక వర్గంలో లక్షమంది పోలీసులు వచ్చి కూర్చున్న ముప్పై వేల మెజారిటీతో తన గెలుపు ఖాయమని ధీమాను ఆయన వ్యక్తం చేశారు