స్ట్రాంగ్ రూములకు చేరుకుంటున్న ఈవీఎంలు

0

మరో 22రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్ల పై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది నియామకం దాదాపుగా పూర్తయ్యిందని, శిక్షణ, అవగాహన వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో ప్రక్క ఎన్నికలకు సంబంధించి సామగ్రిని అధికారులు జిల్లా కేంద్రాల నుండి ఆయా నియోజకవర్గాలకు చేరవేస్తున్నారు. విశాఖజిల్లా చోడవరం నియోజక వర్గం,గాంధీ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వివిప్యాడ్ లు చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులు వీటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఎన్నికలరోజున వీటిని పోలింగ్ కేంద్రలకు తరలించనున్నారు.