ఏలూరులో ఎగిరే జెండా ఏ పార్టీది…?

0

ఎన్నిక‌లు,ప్ర‌చారాలు ,నామినేష‌న్లు ,ర్యాలీలు ఇప్పుడు ఏపీ అంతా ఎక్క‌డ చూసిన ఇవే క‌నిపిస్తున్నాయి.. వచ్చే ఐదేళ పాల‌న కోసం అభ్య‌ర్ధులంతా ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు..గెలుపు పై ఎవ‌రి లెక్క‌లు వాళ‌కున్నాయి..ఇప్ప‌టికేజెండా రెప‌రెలు,మైకుల మోత‌ల‌తో నేత‌లంతా ప్ర‌చారాల్లో దూసుకుపోతున్నారు… ఈ విష‌యంలో ప‌శ్చిమ‌దావ‌రి జిల్లాలోని రాజ‌కీయవేడి కాస్త ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది.

ఈ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ప్ర‌ధాన పార్టీల నేత‌లు గ‌ట్టిగానే కృషి చేస్తున్నారు. అధికారపక్ష టీడీపీ అభ్య‌ర్ధిగా బ‌డేటి బుజ్జిపోటిచేయ‌నున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది నుంచి టీడీపీ హవానే కొనసాగుతోంది.టీడీపీ అధికారంలో ఉండ‌టం , పార్టీకి ఏలూరు కంచుకోట కావ‌డం బుజ్జీకి కలిసొచ్చే అంశాలు ..మరో వైపు టీడీపీకి బలమైన ప్రత్యర్ధిగా ఆళనాని ని పోటికి దింపారు వైయస్ జగన్. సీనియర్ నాయకుడు, అందరినీ కలుపుకొని పోతారనే పేరు ఆళ్ల నానికి ఉండటంతో…. నాని ప్రజలపైన ప్రభావం చూపిస్తారనే నమ్మ కంతో ఉన్నారు జగన్..మరో వైపు ఏపీ రాజకీయాల్లో కుల ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుందనే చెప్పాలి..

అందుకే ఏలూరు బరిలో జనసేన కాపు సామాజికవర్గం నేత రెడ్డి అప్పలనాయుడిని బరిలో దింపింది.సామాజకవర్గంలో పేరు పలుకుబడి అప్పలనాయుడికి బాగానే ఉంది. దీంతో కాపులంతా అప్పలనాయుడికి ఓటేస్తే ఆయన గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు ..ఇలా ఏలూరు రాజకీయం వేడి వేడిగా సాగుతుంది.. గెలుపు పై ఎవరి ధీమా వారికున్నా ..ఫలితం మాత్రం ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ఇక్కడి పోటి రసవత్తరంగా మారింది.