టీడీపీ రెబల్ అభ్యర్థిగా నిలబడే యోచనలో కదిరి బాబురావు

0

రెబెల్స్ అబ్యర్ధులతో టిడిపి అధిష్ఠానం తలలు పట్టుకుంటుంది. టిక్కెట్ తక్కని టీడీపీ నాయకులూ, సిట్టింగులు, రెబెల్స్ గా బరిలో దిగేందుకు సిద్ధమౌతున్నారు. కనిగిరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు ఈసారి టిక్కెట్ దక్కక పోవడంతో రెబల్ అభ్యర్థిగా నిలబడే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో బాబురావును బుజ్జగించేందుకు అయన మిత్రుడు, సినీహీరో బాలకృష్ణను అధిష్ఠానం రంగంలోకి దించింది. కాగా మొన్న చేరిన ముక్కు ఉగ్రనర్సింహరెడ్డికి పార్టీలో ప్రధాన్యత ఇవ్వడంపై బాబురావు వర్గం అసంతృప్తితో ఉన్నారు. టికెట్ దక్కకపోయిన రెబెల్ అబ్యర్ధిగా పోటీచేయాలని బాబురావు అనుచరులు సూచిస్తున్నారు