ప్ర‌క‌ట‌న‌ల ఖ‌ర్చు.. ప్రతీ లెక్క తెలియాలి.

6
ap west godavari jilla collector, praveenkumar.
ap west godavari jilla collector, praveenkumar.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌నల ఖ‌ర్చుల‌ను నిష్ప‌క్ష‌పాతంగా లెక్కించాల‌ని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉన్న గిరిజ‌న భ‌వ‌న్‌లో ఎన్నిక‌ల మీడియా స‌ర్టిఫికేష‌న్ అండ్ మానిట‌రింగ్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఇచ్చే ప్రకటనలు, సోషల్‌ మీడియా ద్వారా వచ్చే అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల వ్యయంగా వారి ఖాతాలో లెక్కిస్తారన్నారు. వారు చేసే ప్ర‌క‌ట‌న‌ల ఖ‌ర్చును లెక్కించి ఈ సెల్ ద్వారా ప్ర‌తీరోజు ఈసీ కి తెలియ‌ప‌రచాల‌న్నారు.

ఎన్నికల సమయంలో నగదు, మద్యం, విలువైన వస్తువులను ఓటర్లకు పంచేందుకు ప్రయత్నించే వారిని నిరోధించడానికి సీ-విజిల్ అనే యాప్‌ దోహదపడుతుందని ఈ సంద‌ర్భంగా అన్నారు. అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ప్రజలు ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ ఈశ్వరరావు, ప్రత్యేక బ్రాంచి డీఎస్పీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.