చంద్రబాబు పప్పులు ఉడకవు.. జగనే కాబోయే సీఏం

0

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియా పాయింట్ లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కీలక నేత మృతి పట్ల ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై రోజా మండి పడ్డారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ రాజా రెడ్డిని హత్య చేశారని , ఇటీవల కాలంలో జగన్ పై హత్య కుట్ర జరిగిందరని ఆమె అన్నారు. వీటి వెనుక ఏవరి హస్తం ఉందన్నది ప్రజలను అడితే చెబితారని , తామేమి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు అత్యంత ధారుణంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రి పదవిలో ఉండి కుటుంబలోని వివాదాల వలన హత్య కాబడ్డాడని చంద్రబాబు చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని , ఎన్నికల్లో చంద్రబాబు జిమ్మిక్కులు పనిచేయవని అన్నారు.