పార్టీ మారనున్న మాజీ మంత్రి కొణతాల

0

మాజీ మంత్రి కొణతాల రామక‌ష్ణ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. తన అభిమానులు, అనుచరులతో సమావేశానంతరం రామకృష్ణ ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే మార్చి 15 ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌ లో జగన్ నివాసానికి వెళ్లి అయన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది.

కొణతాల టీడీపీలో చేరనున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. అనూహ్యంగా అయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రామకృష్ణకు రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావు కూడా ఇటీవల వైసీపీలో చేరారు. ప్రస్తుతం కొణతాల కూడా వైసీపీలో చేరనుండటంతో విశాఖ జిల్లాలో మరింత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.