“స్వచ ధార” కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

0

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షితమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘స్వచ్ఛ ధార’ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామీణ‌ ప్రాంతాల‌లో ఆరు నెల‌లకోసారి ప్రత్యేక వాహనాల ద్వారా అన్ని వాట‌ర్ ట్యాంకుల‌నూ అత్యాధునిక సాంకేతికతతో పరిశుభ్రం చేయనున్నారు. గ్రామాలలో వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధులను అరికట్టడానికి, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాట‌ర్‌ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భగంగా గుంటూరు జిల్లాలో ‘స్వచ్ఛ ధార’ కార్యక్రమంలో సేవలందించడానికి సిద్ధంగా ఉన్న వాహనాలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి మొక్కలు నాటి వాహనాలను సిబ్బందికి అందించారు