ప్రధాని ప‌ర్య‌ట‌న సిగ్గుచేటు.

0

రేపు గుంటూరులోని ప్ర‌జా చైత‌న్య స‌భ‌కు విచ్చేయ‌నున్న న‌రేంద్ర మోదీపై వామ‌ప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెరవేర్చ‌కుండా రాష్ట్రంలో ఎలా అడుగు పెడ‌తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. విజయనగరం లో సిపిఐ, సిపిఎం పార్టీల ఆద్వర్యంలో నిర్వ‌హించిన ర్యాలీలో మ‌ట్టి కుండలతో నిరసన తెలియజేసి అనంతరం వాటిని పగులగొట్టారు. రాజధాని శంకుస్థాపనకు మట్టి నీళ్లు తెచ్చిన మోదీ రాష్ట్ర ప్ర‌జ‌ల నోళ్ల‌ల్లో మ‌ట్టి కొట్టార‌ని విమ‌ర్శించారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.