అవినీతి ర‌హిత పాల‌నే నా ల‌క్ష్యం

18
andrapradesh, ys jagan, narsipatnam , meeting
andrapradesh, ys jagan, narsipatnam , meeting

ఏపీలో రాజ‌కీయ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. అధికార పార్టీ, విప‌క్ష‌పార్టీల అధినేతలు పోటాపోటీగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా నుంచే వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించింది. పార్టీ అధినేత జ‌గ‌న్ నర్సీపట్నం వేదికగా రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నర్సీపట్నం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.