పవన్ పోటీ చేయనున్న రెండు స్థానాలపై క్లారిటీ వచ్చింది.

0

జనసేన పార్టీ అధినేత, పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు మార్చి 19న పవన్‌ కళ్యాణ్ తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధినేత పోటీ చేయనున్న స్థానాలకు సంబందించిన ప్రెస్ నోట్ జనసేన కార్యాలయం నుంచి విడుదలైంది.

అయన భీమవరం, గాజువాక స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిన జనసేన జనరల్ బాడీ, గాజువాక, భీమవరం, పిఠాపురం, పెందుర్తి, ఇచ్ఛాపురం, అనంతపురం, తిరుపతి, రాజానగరం, నియోజకవర్గాలు అగ్రస్థానాలలో నిలిచినట్లు వెల్లడించింది. జనరల్ బాడీ, విద్యావేత్తలు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక స్థానాలను ఎంచుకున్నట్లు నోట్ లో పేర్కొన్నారు.