చిరంజీవి బాటలోనే పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ ద్వారా తెలిపిన పవన్.

0

జనసేన పార్టీ అధినేత, పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి కొంత క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు పవన్‌కల్యాణ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు. పార్టీ కార్యవర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్‌కల్యాణ్‌ పోటీ వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే స్థానానికి అభ్యర్థిని ప్రకటించక పోవడంతో ఈ వాదనకు కొంత బలం చేకూరినట్లవుతుంది.

ఇక ఇప్పుడు పవన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ నడుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. తిరుపతితో పాటు సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే పాలకొల్లులో ఓటమి చెంది తిరుపతిలో గెలుపొందారు. అయితే ఇప్పుడు పవన్ కూడా అన్న బాటలోనే వెళ్తున్నట్లు అర్ధమవుతుంది. అయితే గాజువాక పై అటు ఇటుగా ఉన్నప్పటికీ, రెండో స్థానంపై స్పష్టత రావలసి ఉంది.