జనసేనలో చేరి జగన్ వైపు చూస్తున్న దేవినేని

0

జనసేనాని ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ కండువా కప్పుకున్న గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, టికెట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసారు…. తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన పవన్, మొండి చెయ్యి చూపించడంతో .. నేడు తన అనుచరులతో సమావేశమై, సాయంత్రం లేదా రేపు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కి చేరనున్నట్లు సమాచారం … జనసేన నుంచి దేవినేనికి టికెట్ లభిస్తుందని తొలుత భావించినా, పవన్ మాత్రం కమతం సాంబశివరావువైపు మొగ్గు చూపారు.

కమతానికి టికెట్ ఇస్తున్నట్లు మూడో జాబితాలో పేరును చేర్చారు పవన్ . దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న దేవినేని వర్గం జనసేనలో ఉండవద్దని ఆయన పై అ ఒత్తిడి తెస్తుండగా, వైకాపాలో చేరేందుకు ఆయన సమాయత్తమవుతున్నాట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే దేవినేనితో చర్చించిన జనసేన నాయకులు టికెట్ ఇవ్వలేకున్నా, పార్టీలో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో వైపు దేవినేని చేరికతో, రేపల్లె, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ బలం పెరిగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.