ప్రజలను “ఓట్లు” అడుగుతుంటే, వాళ్ళు మమ్మల్ని “నీళ్లు” అడుగుతున్నారు : రాచమల్లు

89
ap ycp leader, rachamallu sivaprasad reddy.
ap ycp leader, rachamallu sivaprasad reddy.

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైకాపా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేడు ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధిలో విఫలం చెందారని విమర్శించారు.

ఎన్నికల వేళ టికెట్ కోసం చంద్రబాబు ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న స్థానిక నాయకులు నాలుగేళ్ల కాలంలో ఎందుకు ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి గడప తొక్కలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలపై మీకున్న ఆరాటం ప్రజల సమస్యలపై లేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చాక నియోజక వర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.