కాకినాడ లోక్ సభ అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ..?

0

కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా వంగ గీత పేరును వైసీపీ దాదాపుగా ఖరారు చేసింది. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన గీత.. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాకినాడలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండటంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన గీతను ఇక్కడి నుంచి బరిలో దింపడం ద్వారా ఆ స్థానాన్ని దక్కించుకోవచ్చునని జగన్ భావిస్తున్నారు.

ప్రస్తుత కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం కూడా వైసీపీలోనే ఉన్నారు. గీత గెలుపుకు ఆయన కూడా సహకరిస్తే పని మరింత సులువువతుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున జగ్గంపేట నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. అదే సమయంలో టీడీపీ జగ్గంపేట ఇన్‌చార్జిగా పనిచేసిన జ్యోతుల చంటిబాబు వైసీపీ గూటికి చేరారు. నెహ్రూను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్న జగన్.. తోట నరసింహం సతీమణి వాణికి అవకాశం ఇస్తారా..? లేక జ్యోతుల చంటికి అవకాశం ఇస్తారా..? అన్న చర్చ జరుగుతోంది. మరికొద్దిరోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.