తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించిన నందమూరి బాలక్రిష్ణ

0

నందమూరి బాలకృష్ణ తమ సొంత ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు లో తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళు అర్పించారు .. ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ బృందం నిమ్మకూరు లో సందడి చేశారు .. క్రిష్ దర్శకత్వం లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్” ఈ చిత్రం రెండు భాగాలు గా కథానాయకుడు – మహానాయకుడు .. గా రూపొందించారు … ఈ చిత్రం మొదటి భాగం కథానాయకుడు సంక్రాంతి సందర్బంగా 8వ తేదీ బుధవారం విడుదల కాబోతుంది

విడుదల సందర్బంగా చిత్ర యూనిట్ బృందం , నందమూరి బాలకృష్ణ ,కళ్యాణ్ రామ్ బాలీవుడ్ హిరోయిన్ విద్యాబాలన్ తదితరులు పాల్గొన్నారు ..అనంతరం మీడియా సమావేశం లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం విడుదల అవుతున్న సందర్బంగా అందరిని కలుసుకొని , అమ్మ ,నాన్న ఆశీర్వాదం తీసుకుందమని వచ్చామని ఆయన అన్నారు …. అందరూ అభిమానించే మహానుభావుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు .. ఎన్టీఆర్ ఒకవర్గానికో పార్టీ కో పరిమితం కాదని అందరికి కావాల్సినవాడు అని అన్నారు .. నిమ్మకూరు కు రావటం ఒక మంచి అనుభవం కల్గించిందని సినీ నటి విద్యాబాలన్ నాతో అన్నారని బాలకృష్ణ మీడియా ముందు తెలిపారు ..

ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ చాలా కష్టపడ్డారని అన్నారు.. బసవ తారకం పాత్ర పోషించిన నటి విద్యాబాలన్ మాట్లాడుతూ తెలుగు లో మొదటి చిత్రం ఎన్టీఆర్ కావటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానని ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని ఎన్టీఆర్ బసవతారకం ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని విద్యాబాలన్ మీడియా తో మాట్లాడారు . ఈ కార్యక్రమానికి బాలకృష్ణ , కళ్యాణ్ రామ్ , ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, నటుడు పాల్గొని నివాళు అర్పించారు ..