కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ..

0

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. జనవరి 10న జరిగిన సభలో టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైకాపా నాయకులు పార్థసారథి ల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. జనవరి 11 న పెదఓగిరాలలో కూడా ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆ గ్రామానికి వచ్చే మార్గంలో ఉన్న జాతీయ రహదారిపై భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

పోలీసులు ఊహించినట్టే సభ వద్దకు వచ్చేందుకు అక్కడకు చేరుకున్న పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు, సభ నుంచి వెళ్లిపోయేందుకు బోడె ప్రసాద్ జాతీయ రహదారిపైకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ వాహనాన్ని పార్థసారథి అనుచరులు అడ్డుకుని, వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో, మరోసారి ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు రాళ్ళూ రువ్వుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ బలగాలు ఇరు వర్గాల వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, నాయకులను అక్కడినుండి పంపివేశారు..