ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న టీడీపీ నేత ..

72
ap , teludesham party.
ap , teludesham party.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో, ఎన్నికల విధుల్లో క్షణం తీరిక లేక పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి పై టీడీపీ నేత తన బలాన్ని ప్రదర్శించాడు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల పరిషత్ కార్యాలయంలో తోటి ఉద్యోగులు చూస్తుండగానే కెనమాకులపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహింస్తున్న రవి నాయక్ పై ఇదే పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నేత నారాయణ రెడ్డి దాడి చేయటమే కాకుండా నోటికి పనిచెప్పి వీరంగం సృష్టించాడు.

ఈ ఘటన స్థానిక ఎంపీడి కార్యాలయంలోనే చోటు చేసుకోవడంతో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు, న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గౌరీవారి శ్రీనివాసులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమనిగింది. కాగా పంచాయతీ కార్యదర్శి పై దాడికి పాల్పడిన నారాయణ రెడ్డి ని కార్యాలయం నుంచి బయటకుయ పోకుండా ఉద్యోగులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై వైసీపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తున్నట్లు వెల్లడించారు.