మేకపాటికి బుజ్జగిస్తున్న ప్రభాకర్ రెడ్డి..

0

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తన్న సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డవారు రోజు రోజుకు పెరిగిపోతున్నరు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే నెల్లూరు జిల్లాలో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులుగా ఉన్న మాజీ ఎంపి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీ స్థానం ఇవ్వక పోవటంతో అల‌క‌బూనారన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి

పార్టీ అధిష్టానం సీనియర్ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా కొన్ని గంట‌ల క్రితం టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ సీటు జగన్ ఖ‌రారు చేయ‌డంతో, రాజ‌మోహ‌న్ రెడ్డిని ప‌క్క‌న‌బెట్టారన్న వార్తాలు నెల్లూరు జిల్లా లోని ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. . దీంతో ఆయ‌న పార్టీ అధిష్టానంపై అల‌క‌వ‌హించిన‌ట్లు స‌మాచారం. దీంతో రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఆదాల నెల్లూరుకు వ‌చ్చిన త‌రువాత నేరుగా మేక‌పాటి నివాసానికి చేరుకుని, ఆయ‌న్ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ ఆశీస్సులు కావాలంటే ఆదాల మేక‌పాటిని కోరారు. ఆదాల , మేక‌పాటి నివాసానికి చేరుకోవ‌డం ప్రస్తుతం చ‌ర్చానీయంశంగా మారింది. ఇప్పుడిప్పుడే జిల్లాలో బలం పుంజుకుంటున్న వైకాపా కు మేకపాటి షాక్ ఇవ్వ నున్నారా అన్నది తెలియాలంటే ఆయన తదుపరి కార్యాచరణ వెల్లడించాల్సింది. కాగా ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు గత రెండుయ రోజుల నుంచి మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి ఎన్నికల నామినేషన్ నాటికి ఎంత మంది ఏ పార్టీ కండువాలు కప్పుకుంటారో ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉంటారో తెలియాలంటే అప్పటి దాక వేచి చూడాల్సి ఉంది.