రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది సీపీఎం ప్రధాన కార్యదర్శి మధు

0

ఆంధ్ర ప్రదేశ్ కు విభజన చట్టంలోని హామీలను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్నాయం చేసిందని, అధికార టీడీపీ ప్రభుత్వం హామీలను తీసుకు రావడంలో విఫలమైందని సీపీఎం ప్రధాన కార్యదర్శి మధు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై వాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తామన్న ఏ ఒక్క హామీ కూడా నిరవేర్చలేదని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వ పాలనలో అనేక పరిశ్రములు మూత పడ్డాయని, ఉత్తరాంద్ర నుండి 30వేలకు మందికి పైగా ప్రజలు వలస కూలీలుగా మారారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ సీపీ విఫలమైందని మధు వ్యాఖ్యానించారు. కేంద్రంలో జారిపోతున్న బీజేపీ పార్టీని రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ బలపరుస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కూడా దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చారని మధు అన్నారు.

ఏపీ లో రానున్న ఎన్నికల్లో టీడీపీ , వైఎస్ఆర్ ఈ రెండు పార్టీలకు ప్రత్యమ్నాయంగా జనసేన , వామపక్ష పార్టీలు కనిపిస్తున్నాయని మధు తెలిపారు. జనవరి 18, 19, 20 మూడు తేదీల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ఇరు పార్టీలు చర్చించనున్నట్లు తెలిపారు. ఏ నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేయ్యాలనేది మూడు పార్టీలు చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని మధు తెలిపారు.