బోయినవారిపాలేం లో వృద్దురాలి హత్య.. డాగ్ స్వాడ్ ద్వారా వ్యక్తిని అదుపుతోకి తీసుకున్న పోలీసులు

0

ప్రకాశం జిల్లా , చీరాల మండలం బోయినవారి పాలేం గ్రామ శివార్లలోని శివాలయం సమీపంలో ఇసుకలో పూడ్చి ఉన్న మృత దేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి అదేగ్రామానికి చెందిన జంగలి కుమారిగా (55) గుర్తించారు. మృతురాలి ఒంటిపై , తలకు బలమైన గాయాలు ఉండటంలో ఇది హత్యగా భావించి పోలీసులు డాగ్ స్వాడ్ ని రంగంలోకి దింపారు. పోలీస్ జాగిలం ఇచ్చిన సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.