ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన అంబులెన్సు, నలుగురు మృతి

0

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో, గేట్స్ కాలేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. కర్నూలు నుండి అనంతపురం ఏడుగురు వ్యక్తులతో వెళ్తున్న అంబులెన్స్ వాహనం, గుత్తి పట్టణ సమీపంలో రోడ్డు ప్రక్కనే నిలిపి ఉన్నలారీ వెనుక వైపు ఢీకొంది.

దీంతో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న4 మృతి చెందారు, తీవ్రంగా గాయపడ్డవారిని అనంతపురం సవేరా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న గుత్తి పోలీసులు, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. మృతులు మస్తాన్ వలి, భాజీ గా పోలీసులు గుర్తించారు. వీరంతా గుంటూరు జిల్లా నరసారావు పేటకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.