ప‌దోత‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం

13
andrpradesh road ravana samsta.
andrpradesh road ravana samsta.

పదో తరగత పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు చెప్పింది. పదో తరగతి ప రీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి ఏడాదిలానే ఈఏడాది కూడా ఏపీఎస్‌ఆర్టీసీ బ స్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం క ల్పిస్తూ సంస్థ వీసీ అండ్ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కేవలం హాల్ టికెట్ చూ పించి తమ నివాస ప్రాంతం నుండి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు మళ్లీ తిరుగు ప్రయాణానికి ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుందన్నారు.

బస్సుపాసు లేకున్నా, ఇంత దూరం అనే నిబంధనతలో ని మిత్తం లేకుండా ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. ఈ ప్రయాణం తెలుగువెలుగు, సిటీ సబర్బన్ బస్సులలో ఉచితం కాగా, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్ర యాణం చేయదలచుకునే వారు తమ బస్సుపాసు మరియు పరీక్ష హాల్ టికె ట్టు చూపి, కాంబినేషన్ టికెట్ పొం దడం ద్వారా, తాము పరీక్షలు రాస్తున్న పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్ర యాణం చేయవచ్చు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పరీక్షలు జరిగే తేదీల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది.

మార్చి 18న మొదలు ఏప్రిల్ 3వరకు పరీక్షలు జరిగే తేదీలలో ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుంది. పరీక్ష తేదీలలో ఏదైనా సెల వు రోజులు ఉన్నప్పటికీ ఈ ఉచిత ప్ర యాణం వర్తిస్తుంది. ఈ విషయానికి అత్యధిక ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సురేంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు ఈఉచిత ప్రయాణం నోటీస్ బోర్డు ద్వా రా తెలపాలన్నారు. గేట్ మీటింగ్‌ల ద్వారా తెలపాలన్నారు. పరీక్షలను దృ ష్టిలో ఉంచుకుని తగినన్ని బస్సులు న డపాలని ఇప్పటికే అందరు రీజినల్ మే నేజర్లుకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సు మారు 6.21 లక్షల మంది విద్యార్థుల కు సంబంధించి ఈ ఉచిత బస్సు ప్ర యాణ సౌకర్యం వర్తించేలా ఆర్టీసీ చ ర్యలు తీసుకుంది. పరీక్షలు రాష్ట్ర వ్యా ప్తంగా 2838 సెంటర్లలో జరగనుంది.