పీఎం మోడీకి వ్య‌తిరేకంగా టీడీపీ శ్రేణుల బైక్ ర్యాలీ

0

ఫిబ్ర‌వ‌రి 10న గుంటూరులో బీజేపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జా చైత‌న్య స‌భకు ముఖ్య అతిధిగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో గుంటూరు తెలుగు యువ‌త ఆధ్వ‌ర్యంలో మోడీకి వ్య‌తిరేకంగా బైక్ ర్యాలీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తెలుగు యువ‌త నాయ‌కులు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాన్ని న‌మ్మించి మోసం చేసింద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రానికి ప్ర‌ధాని ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఆ త‌రువాత‌నే రాష్ట్రంలో అడుగుపెట్టాల‌ని సూచించారు.