దేశంలో ఎన్న‌డూ లేనంత‌గా పేద‌ల కోసం ఇళ్లు

0

దేశంలో ఎన్న‌డూ లేనంతగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పేద‌ల కోసం ఇళ్లు నిర్మిస్తున్న‌ట్లు మంత్రి కాల్వ‌శ్రీనివాసులు అన్నారు. కేంద్రం అర‌కొర నిధులు మంజూరు చేస్తున్న ఏపీ ప్ర‌భుత్వం త‌న సొంత నిధుల‌తో 10 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు. రూ.ల‌క్షా50వేల‌తో ఉచితంగా నిర్మిస్తున్న‌ట్లు సూచించారు. గ‌త ప్ర‌భుత్వాలు 24వేల 500 స‌బ్సిడీ ఇస్తే మిగిలిన మొత్తం బ్యాంక్ రుణంగా ఉండేద‌ని అన్నారు.

కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చొర‌వ‌తో పూర్తిస్థాయిలో స‌బ్బీడీ ఇస్తున్న‌ట్లు పున‌రుద్ఘాటించారు.
ప‌ట్ట‌ణాల్లో 2ల‌క్ష‌లా 50వేలు , బ‌హుళ అంత‌స్థుల‌కు రూ.3ల‌క్ష‌లు ఉంటే అందులో రూ. ల‌క్షాయాబైవేలు రాష్ట్ర‌ప్ర‌భుత్వం, రూ.ల‌క్షాయాబైవేలు కేంద్ర‌ప్ర‌భుత్వం అందించిన‌ట్లు చెప్పారు. దీంతో పాటు మౌలిక స‌దుపాయాల‌కోసం రూ.1ల‌క్ష రూపాయాలు ఇచ్చిన‌ట్లు తెలిపారు.