టీడీపీపై విరుచుకు పడిన జంగా కృష్ణమూర్తి

0

బీసీ వర్గాల విద్యార్థులకు ఫీజు రీయంబర్సెమెంట్ టీడీపీ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వలేదని దింతో చాలా మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసి రోడ్ల మీద తిరుతున్నారని వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జాంగా కృష్ణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు రోడ్డున పడడానికి టీడీపీ ప్రభుత్వమే కారణం అని అయన ధ్వజమెత్తారు. అసలు బీసీ వర్గాల వారిని టీడీపీ పట్టించుకోవడం లేదని బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. బీసీ వర్గాల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధులను ఏం చేసారో చెప్పకుండా నాటకాలు చేస్తున్నారు అంటూ విరుచుకు పడ్డారు. టీడీపీ నాటకాలను అన్ని బహిరంగ సభలో బయటపెడతామని తెలిపారు.