ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అదాని గ్రూప్స్

0

దేశంలో వివిధ రాష్ట్రల్లో అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న అదని గ్రూప్ సంస్థ, తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో “రిన్యూవబుల్ పవర్డ్ డేటా సెంటర్ పార్క్”ను అదాని సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు అదని సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ” రిన్యూవబుల్ పవర్డ్ డేటా సెంటర్” స్థాపించడం వల్ల భవిష్యత్ లో అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చంద్రబాబు తెలిపారు.

ఈ సమావేశంలో అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని మాట్లాడుతూ భారత దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమ సంస్థలు ఉన్నాయని తెలిపారు. రిన్యూవబుల్ పవర్డ్ డేటా సెంటర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందని, త్వరలోనే పనులు చేపడతామని ఆయన అన్నారు.