జోస్యం చెప్పిన నారాలోకేష్

0

ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్ జోస్యం చెప్పారు. అడ్డగోలుగా విభజించి క‌ష్టాల్లోకి నెట్టిన రాష్ట్రాన్ని సీఎం చంద్ర‌బాబు అభివృద్ధి ప‌థంవైపు న‌డిపిస్తున్నార‌ని అన్నారు.కాంగ్రెస్ హ‌యాంలో క‌ట్టిన ఇల్లు కూలిపోతుంటే చంద్ర‌బాబు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయ‌డం ఆయ‌న ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు

తిరుప‌తిలో నీలాద్రి గృహ స‌ముదాయాన్ని ప్రారంభించిన నారాలోకేష్ అన్ని వసతులతో పేదల సొంతింటి కల నెరవెర్చే లక్ష్యంతో త‌మ‌ పార్టీ అధినేత అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. కానీ ప్రత్యేకహోదా ఇచ్చి భుజం తట్టాల్సిన ప్రధాని మోడీ నమ్మక ద్రోహానికి పాల్పడ్డార‌ని సూచించారు.
ఇంత జ‌రుగుతున్నా ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత జ‌గ‌న్ మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట అనడం లేద‌న్నారు.ఆంధ్ర ప్రజలను దూషించిన కేసీఆర్ తో జగన్ చేతులు కలుపుతూ వైసీపీ డ్రామా కంపెనీలా మారింద‌ని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్ర‌జ‌లు రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీని ఆశీర్వ‌దించి జగన్, మో డీలకు బుద్ధి చెప్పాల‌ని పున‌రుద్ఘాటించారు.