జ‌గ‌న్ ప‌రిశ్ర‌మ‌ల గురించి మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంది

93
ap ytdp party leader yamini comment ys jagan.
ap ytdp party leader yamini comment ys jagan.

వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌కు ఓటేయ్యండ‌ని అడిగే హ‌క్కులేద‌ని అన్నారు టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు సాధినేని యామిని. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం పై మీడియాతో మాట్లాడిన ఆమె, 200మందిని ప్రాణం తీసిన వ్య‌క్తి ప్ర‌జ‌ల్ని ఓట్లు ఎలా అడుగుతార‌ని ప్ర‌శ్నించారు. ప‌రిశ్ర‌మ‌ల గురించి జ‌గ‌న్ మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. టెండ‌ర్ల కోసం వ‌చ్చిన వారు మిమ్మ‌ల్ని చూసి పారిపోతారు. ఎందుకంటే మీకు అలాంటి ఘ‌నచరిత్ర ఉందంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ హ‌యాంలో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేవారిని మీరు ఎంత‌లా టార్చ‌ర్ పెట్టారో చ‌రిత్ర చూస్తే తెలిసిపోతుంద‌ని తెలిపారు.