ఆదాల ఓ అవకాశవాది : సోమిరెడ్డి

32
ap tdp leader somireddy chandra mohanreddy.
ap tdp leader somireddy chandra mohanreddy.

నెల్లూరు రూరల్ నియోజక వర్గం టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన ఆదాల నిన్నటి వరకు టీడీపీ పార్టీలో నేడు ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు ఆదాల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్బంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ అవకాశ వాది అని తనకు డబ్బు పిచ్చి తప్ప మరేం లేదంటూ తీవ్రస్థాయిలో ద్వజమెత్తరు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ది చెప్పాలని కోరారు. ప్రజల సమస్యలకన్నా ఆయనకు అధికారం, పదవి, అంటే వ్యామోహం అని అందుకే ఎన్నికలోచ్చిన ప్రతిసారీ పార్టీలు మారుతూనే ఉంటారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.